Thu Apr 02 2026 22:00:53 GMT+0530 (India Standard Time)
జగన్ పై లోకేష్ ఫైర్
ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కి నిజం చెప్పే అలవాటు లేదన్నారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న శాపం జగన్ కు ఉందేమోనని లోకేష్ ఎద్దేవా చేశారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా మరణాలను సహజ మరణాలుగా అసెంబ్లీలో జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేశారని, అయితే ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలోనే నాటుసారా బట్టీలు బయటపడ్డాయని లోకేష్ అన్నారు.
అబద్ధాలే శ్వాసగా...
అబద్ధాలే శ్వాసగా జగన్ బతుకుతున్నారని లోకేష్ అన్నారు. పులివెందులలో బయటపడిన నాటుసారా బట్టీల గురించి ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో 2021 నుంచి ఇప్పటి వరూక 300 కేసులు నమోదయ్యాయని, దీన్ని బట్టి పులివెందులలో నాటుసారా బట్టీలు ఎన్ని ఉన్నాయో అర్థమవుతుందన్నారు.
Next Story

