Thu Apr 02 2026 17:14:41 GMT+0530 (India Standard Time)
జగన్ రెడ్డీ గుండు కొట్టించుకో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గుండు కొట్టించుకుంటే ఆయన వెంట్రుకలు ఎవరూ పీకలేరని ఎద్దేవా చేశారు. నిన్న నంద్యాల సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ ట్విట్లర్ లో స్పందించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పనికి మాలిన వాడివని తేలిపోయాక ఫ్రస్టేషన్ కాకుంటే ఫన్ వస్తుందా? అని లోకేష్ ప్రశ్నించారు.
వెంట్రుక మహారాజ్...
తమకు జగన్ అంత తీరికలేదన్నారు. వైసీపీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనతో తాము ఉన్నామని, ప్రజలే వైసీపీ వెంట్రుకలు పీకి గుండు కొట్టించి పిండి బొట్లు పెడతారని లోకేష్ ఎద్దేవా చేశారు. వెంట్రుక మహారాజ్... ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story

