Mon Mar 23 2026 20:30:52 GMT+0530 (India Standard Time)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందచేశారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న లోకేష్ ఉదయాన్నే స్వామి వారిని దర్శించకున్నారు. మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం కుప్పానికి...
కుప్పం నియోజకవర్గంలో పాదయాత్రల కమిటీలతో ఆయన సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభిస్తారు. మొత్తం నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర జరపనున్నారు. కొన్ని ఆంక్షలతో లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.
Next Story

