Fri Dec 05 2025 13:18:06 GMT+0000 (Coordinated Universal Time)
చినబాబు సెటైర్లు చూశారా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై సెటైర్ వేశారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై సెటైర్ వేశారు. ఆయక దుబాయ్ పర్యటన పై ఛలోక్తులు విసిరారు. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇచ్చేందుకు అబుదాబి వరకూ వెళ్లాలా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ గురించి దుబాయ్ లో పెద్దగా ఎవరికీ తెలియదని గౌతం రెడ్డి చెప్పడం ఆయన టోటల్ స్పీచ్ కే హైలెట్ గా నిలిచిందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
ఉన్న కంపెనీలు....
ప్రస్తుత ప్రభుత్వం బెదిరింపులతో ఉన్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయని లోకేష్ విమర్శించారు. గత మూడేళ్లుగా ఏపీకి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఘనత సదరు మంత్రిగారికే లభించిందన్నారు. ఏపీ పరువును అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలపడానికి మంత్రి గౌతంరెడ్డి దుబాయ్ పర్యటనకు వెళ్లినట్లుందని లోకేష్ అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం పక్కన పెడితే ఉన్న కంపెనీలు పోకుండా చూసుకోమని లోకేష్ అన్నారు.
Next Story

