Wed Jan 21 2026 03:25:05 GMT+0000 (Coordinated Universal Time)
శభాష్.. శివయ్యా.. లోకేష్ ట్వీట్
అలాంటి నిఖార్సయిన కార్యకర్తలే పార్టీకి కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు

అలాంటి నిఖార్సయిన కార్యకర్తలే పార్టీకి కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో శివయ్య అనే టీడీపీ కార్యకర్త తమకు ప్రభుత్వ పథకాలు అక్కరలేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి మొఖంపైనే చెప్పటాన్ని ఆయన ప్రశంసించారు. ఇలాంటి కార్యకర్తలే పార్టీకి బలమని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇచ్చిన పత్రాన్ని తీసుకునేందుకు కూడా నిరాకరించాడు. తన ఇంటిమీద ధైర్యంగా తెలుగుదేశం జెండాను కట్టాడు.
ప్రభుత్వ పథకాలను...
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ కుటుంబానికి పథకాలు నిలిపేయాలని వాలంటీర్ ను ఆదేశించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై లోకేష్ స్పందించారు. ప్రభుత్వ పథకాలను నిలిపివేయడానికి మీరెవరు? అని ప్రశ్నించారు. ఆ హక్కు మీకు లేదంటూ లోకేష్ ట్వీట్ చేశారు. బీసీ కుటుంబానిక పథకాలను నిలిపేయడం జగన్ ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమని నారా లోకేష్ పేర్కొన్నారు.
Next Story

