Sun Mar 22 2026 06:28:49 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు నారా లోకేష్
ితెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖకు చేరుకున్నారు. ఆయన ఈరోజు కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖకు చేరుకున్నారు. ఆయన ఈరోజు కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు. ఒక కోర్టు కేసులో నారా లోకేష్ ఈ నెల 24వ తేదీన విశాఖ కోర్టుకు హాజరయ్యారు. అయితే నేటికి ఆ కేసు విచారణను వాయిదా పడటంతో తిరిగి ఈరోజు విశాఖకు వచ్చారు.
కోర్టు కేసుకు...
ఒక ప్రధాన పత్రిక తనను, తన కుటుంబాన్ని అవమానపర్చే విధంగా కథనాలను ప్రచురించిందని లోకేష్ పరువు నష్టం దావా వేశారు. సాక్షి పత్రికలో తనను కించపరుస్తూ కథనాలను ప్రచురించినందున 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖకు నారా లోకేష్ చేరుకున్నారు. లోకేష్ కు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
Next Story

