Thu Mar 19 2026 05:05:33 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు రికార్డు స్థాయిలో జరగనుంది. యువగళం పేరిట జరగనున్న ఈ పాదయాత్రకు పోలీసులకు ఆంక్షలతో కూడిన అనుమతులను మంజూరు చేశారు. నేడు కుప్పం నుంచి ఉదయం 11.03 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.
బాలకృష్ణ జెండా ఊపి...
నందమూరి బాలకృష్ణ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పంలోని వరదరాజగుడిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కుప్పంలో భారీ బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. పాదయాత్రకు, బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story

