Thu Dec 18 2025 05:38:52 GMT+0000 (Coordinated Universal Time)
నేను మూర్ఖుడిని..నాతో పెట్టుకోవద్దు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబులు దేవుళ్లు అని, తాను వారిలా కాదని మూర్ఖుడినని చెప్పుకొచ్చారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సభలో లోకేష్ ప్రసంగించారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన ఎవరినీ వదిలపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు తమను వేధించిన వారు అమెరికాలో ఉన్నా, ఐవరీకోస్టులో ఉన్నా వదిలపెట్టే ప్రసక్తి లేదని, వెంటాడతానని లోకేష్ అన్నారు.
పూర్తి అండగా.....
కార్యకర్తలకు తాను పూర్తిగా అండగా ఉంటానని లోకేష్ చెప్పారు. ఎటువంటి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదన్నారు. రానున్నది తమ ప్రభుత్వమేనని చెప్పారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు దక్కుతుందని లోకేష్ హామీ ఇచ్చారు. దేనికీ భయపడవద్దని, టీడీపీ అన్ స్టాపబుల్ అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉందని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను వివరించాలని లోకేష్ క్యాడర్ కు పిలుపునిచ్చారు.
Next Story

