Tue Mar 10 2026 05:24:25 GMT+0530 (India Standard Time)
నిమ్మల నిరసన చూశారా....?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆయన పేపర్ బాయ్ గా మారారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో దినపత్రికలను పంపిణీ చేశారు. తెల్లవారు జాము నుంచే ఆయన పట్టణంలోని చందాదారుల ఇళ్లకు వెళ్లి దినపత్రికలను పంపిణీ చేశారు. పట్టణంలోని 31వ వార్డులో ఇంటింటికీ తిరిగి పత్రికలను పంపిణీ చేశారు. ఇందుకు కారణాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు.
పేపర్ బాయ్ గా...
టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడంలో కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ పత్రికలను పంచానని నిమ్మల రామానాయుడు తెలిపారు. సైకిల్ పై ఇంటింటికి తిరుగుతూ పత్రికలను పంచుతూ నిరసన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను గత ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసింది. మిగిలిన పది శాతం పూర్తి చేసి ఇవ్వాలని నిమ్మల రామానాయుడు ఈ విధానాన్ని ఎంచుకున్నారు. నాలుగు రోజుల పాటు ఈ పత్రికలు నిరసన తెలియజేస్తామని తెలిపారు.
Next Story

