Tue Feb 07 2023 14:37:46 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచే లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు మధ్యాహ్నం పాదయాత్రకు ఇంటి నుంచి బయలుదేరనున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు మధ్యాహ్నం పాదయాత్రకు ఇంటి నుంచి బయలుదేరనున్నారు. హైదరాబాద్ లో మధ్యాహ్నం 1.45 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి తారకరామారావుకు నివాళులర్పిస్తారు. సాయంత్రంత కడపకు చేరుకుంటారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కడప అమీన్ పీర్ దర్గాను సందర్శిస్తారు. అక్కడి నుంచి రోమన్ కేథలిక్ చర్చిలో ప్రార్థనలు జరుపుతారు.
తిరుమలలో రాత్రికి బస...
అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి తిరుమలకు చేరుకుంటారు. ఈరోజు రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. 26 ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పం నియోజకవర్గానికి చేరుకుంటారు. ఎల్లుండి నుంచి నారా లోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. పాదయాత్రకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతిని మంజూరు చేశారు.
Next Story