Fri Jan 30 2026 03:42:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీడీపీ లీగల్ సెల్ సమావేశం
నేడు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది.

నేడు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ లీగల్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై నమోదయిన కేసులపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.
యువగళంపై....
అలాగే లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కలిపిస్తున్న అడ్డంకులపై కూడా చర్చించనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ లీగల్ సెల్ నిర్వహించాల్సిన భూమికపైన కూడా చంద్రబాబు చర్చించనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ సదస్సు జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లీగల్ సెల్ కు చెందిన న్యాయవాదులు హాజరు కానున్నారు.
Next Story

