Fri Dec 05 2025 19:10:49 GMT+0000 (Coordinated Universal Time)
రేపు టీడీపీ లీగల్‌సెల్ సదస్సు
ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది.

ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ లీగల్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై నమోదయిన కేసులపై చర్చ జరగనుంది.
కేసులు, అవరోధాలపై...
లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం కలిపిస్తున్న ప్రతిబంధకాలపై కూడా చర్చ జరగనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ లీగల్ సెల్ పాత్రపై కూడా చంద్రబాబు లీగల్ సెల్ కు చెందిన న్యాయవాదులతో చర్చించనున్నారు. అనంతరం సమావేశంలో చంద్రబాబు వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ సదస్సు జరగనుంది. అన్ని జిల్లాల నుంచి లీగల్ సెల్ కు చెందిన న్యాయవాదులు హాజరు కానున్నారు.
- Tags
- legal cell
- tdp
Next Story

