Mon Oct 07 2024 13:48:06 GMT+0000 (Coordinated Universal Time)
డీజీపీని కలవనున్న టీడీపీ... ఆధారాలను సమర్పించేందుకు?
తెలుగుదేశం పార్టీ నేతలు నేడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలవనున్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు నేడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలవనున్నారు. ఆయనను కలసి గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించినట్లు, సంక్రాంతి మూడు రోజుల పాటు కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు.
క్యాసినో వ్యవహారాన్ని....
అయితే క్యాసినో వ్యవహారాన్ని బయటపెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిజనిర్థారణ కమిటీని నియమించారు. వర్ల రామయ్య, బొండ ఉమ, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, తంగిరాల సౌమ్యలతో కూడిన నిజనిర్థారణ కమిటీ గుడివాడ వెళితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈరోజు డీజీపీ గౌతం సవాంగ్ ను కలసి క్యాసినో కు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను ఇచ్చి ఫిర్యాదు చేయనున్నారు.
Next Story