Thu Dec 11 2025 04:20:29 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను నేడు తెలుగుదేశం పార్టీ నేతలు కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను నేడు తెలుగుదేశం పార్టీ నేతలు కలవనున్నారు. మాచర్ల ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నేతృత్వంలో టీడీపీ బృందం గవర్నర్ ను కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ ను కోరింది.
వీడియోలు.. ఫొటోలు...
మాచర్లలో ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుల వాహనాలను, ఇళ్లను తగులపెట్టిన నేపథ్యంలో వారు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, వైసీపీ మూకలు టీడీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరిస్తున్నారని పేర్కొననున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను గవర్నర్ కు అందచేయనున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ బృందం కోరనుంది.
Next Story

