Wed Jan 28 2026 17:52:19 GMT+0000 (Coordinated Universal Time)
అరెస్ట్ అర్ధరాత్రి అవసరమా?
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో అరాచకాలు ఆగడం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసులు ఉంటే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని, అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేయడమేంటని అచ్చెన్నాయుడును ప్రశ్నించారు.
విచారణలో తేలినా?
విద్యార్హతలపై గతంలో అశోక్ బాబు వచ్చిన ఆరోపణలపై నిజం లేదని విచారణలో తేలిందని, అయినా కక్షపూరితంగా అరెస్ట్ చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. ఉద్యోగులను ప్రభావితం చేస్తారన్న ఆగ్రహంతోనే అశోక్ బాబును అరెస్ట్ చేశారని అన్నారు. అక్రమ అరెస్ట్ లకు తెలుగుదేశం పార్టీ నేతలు భయపడబోరని అచ్చెన్నాయుడు తెలిపారు. వెంటనే అశోక్ బాబును విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

