Sun Mar 15 2026 01:30:33 GMT+0530 (India Standard Time)
ఇద్దరికీ బెయిల్
తెలుగుదేశం పార్టీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తెలుగుదేశం పార్టీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగజ్జనని చిట్ఫండ్ కేసులో అప్పారావు, వాసులను ఏపీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిట్ ఫండ్ కంపెనీలో అవకతవకలు చేశారంటూ వారిని కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు.
జైలులో ఉన్న...
రాజమండ్రి జైలులో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, వాసులు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరుపున వాదనల విన్న హైకోర్టు ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. అయితే సీఐడీ విచారణకు ఇద్దరూ సహకరించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
Next Story

