Sun Mar 22 2026 18:25:57 GMT+0530 (India Standard Time)
కోడెల శివరాం అరెస్ట్.... ఉద్రిక్తత
తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు

తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తెనపల్లిలో ఆయన పాదయాత్రకు సిద్ధమయ్యారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోెళన చేపట్టారు. పేరేచర్ల - కొండమోడు రహదారి విస్తరణ పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ కోడెల శివరాం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.
సత్తెనపల్లిలో....
చంద్రన్న ఆశయ సాదన పేరుతో కోడెల శివరాం చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సత్తెనపల్లిలోని టీడీపీ ఆఫీసు నుంచి పాదయాత్రకు బయలుదేరాలని భావిస్తున్న తరుణంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు తీరుకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
Next Story

