Wed Mar 25 2026 23:55:16 GMT+0530 (India Standard Time)
కన్నాకు నిరసన సెగ
తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణకి నిరసన సెగ తగిలింది

తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణకి నిరసన సెగ తగిలింది. గుంటూరు లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కన్నాను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విగ్రహం కలెక్టర్ ఆవిష్కరించక ముందే మీరు ఎలా దండ వేస్తారు అంటూ నినాదాలు చేశారు.
వైసీపీ vs టీడీపీ...
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కన్నా లక్ష్మీనారాయణ పూలదండ వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కన్నా వెళ్లిపోయిన మరుక్షణం ఆయన వేసిన పూలమాలను వైసీపీ నేతలు తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

