Thu Mar 19 2026 11:01:39 GMT+0530 (India Standard Time)
TDP : టీడీపీ చలో మాచర్ల.. అడ్డుకుంటున్న పోలీసులు
తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన మాచర్ల వెళ్లాలని అనుకోవడంతో ఆయనను గృహనిర్భంధం చేశారు. గొల్లపూడిలోని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు.
నేతల గృహనిర్బంధం...
మాచర్లలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై టీడీపీ నేతలు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. చలో మాచర్లకు టీడీపీ పిలుపు నివ్వడంతో అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు పోలింగ్ మరుసటి రోజు నుంచి పోలీసులు జూలకంటి బ్రహ్మారెడ్డిని గృహనిర్బంధం చేశారు.
Next Story

