Mon Feb 02 2026 07:48:10 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో ఇల్లు కట్టుకుంటా.. చంద్రబాబు నిర్ణయం
కుప్పంలో తాను ఇల్లు నిర్మించుకుంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

కుప్పంలో తాను ఇల్లు నిర్మించుకుంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల సమీక్ష సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఇల్లు నిర్మించుకుని, ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించాలని కొందరు నేతలను చంద్రబాబును కోరగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై తరచూ కుప్పం నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు చెప్పారు.
కుప్పం నుంచే....
మరోవైపు కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళనన ప్రారంభించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పార్టీలో కొందరు కోవర్టులున్నట్లు తాను గుర్తించానని, వారందరిని ఏరిపారేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల్లో పనిచేసిన వారికే గుర్తింపు దక్కుతుందని, కుప్పంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ప్రక్షాళన చేయాల్సి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Next Story

