Thu Dec 18 2025 13:45:17 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బాబు భారీ ర్యాలీ.. గన్నవరం నుంచి అడుగడుగునా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ర్యాలీగా ఆయన ఉండవల్లికి చేరుకుంటున్నారు. దారి పొడవునా అభిమానులు పూలవర్షం కురిపించారు. జై బాబు నినాదాలతో మారుమోగిపోయింది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబుకు అడుగడుగనా అభిమానులు, పార్టీ కార్యకర్తలు వచ్చి ఆయనకు స్వాగతం పలకడమే కాకుండా హారతులు ఇస్తుండటం కనిపించింది.
చాలా రోజుల తర్వాత...
చాలా రోజుల తర్వాత ఆయన విజయవాడ చేరుకున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో బెయిల్ పొందారు. ఆయన హైదరాబాద్లో చికిత్స చేయించుకుని నిన్న తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమల నుంచి తొలిసారి బెజవాడకు రావడంతో తెలుగు తమ్ముళ్లు పెద్దయెత్తున స్వాగతం చెప్పారు. మరికాసేపట్లో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంటరీ సమావేశంలో పాల్గొంటారు.
Next Story

