Fri Aug 12 2022 06:40:16 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో చంద్రబాబుకు ఘన స్వాగతం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం 12.25 గంటలకకు కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలవనున్నారు.
రాష్టపతి భవన్ లో....
అనంతరం రాష్ట్రపతి భవన్ లో జరిగే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. తిరిగి రాత్రికి ఢిల్లీ నుంచి బయలు దేరి హైదరాబాద్ చేరుకోనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు బీజేపీ నేతలను కలిసే అవకాశముందని తెలిసింది.
Next Story