Sun Dec 08 2024 09:50:24 GMT+0000 (Coordinated Universal Time)
విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న మండిపాటు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు
వైసీపీ రాజ్యసభ విజయసాయిరెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపిలో మంత్రులు, ఎమ్మెల్యే లు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారని, ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాద్దాంతం చేస్తున్నారన్నారు ఈ ఐదేళ్లల్లో మీరు, మీ జగన్ మీ వాళ్ల నోళ్లు ఎందుకు అదుపు చేయలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర దోచేశాడని, వీటి పై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దాడులు చేయాలనుకుంటే...
నిజంగా తాము దాడులు చేయాలని అనుకుంటే... ఇలా ఉంటుందా పరిస్థితి అని ప్రశ్నించారు. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని మా అధినేత ప్రకటించారని గుర్తు చేశారు. జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశారా అని నిలదీశారు. సింహాలు, పులులు అన్న వాళ్లు... అధికారం పోగానే పిల్లులు అయిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. టిడిపి కార్యాలయం పై దాడి చేసిన దేవినేని అవినాష్ కి గన్ మెన్లు ఇచ్చారన్నారు. బూతులు తిట్టే నాని,వంశీకి భద్రత పెంచింది మీరే నంటూ మండిపడ్డారు.
Next Story