Fri Dec 05 2025 11:36:33 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జగన్ కంటే ముందుగానే చంద్రబాబు సిద్ధమయినట్లు కనిపిస్తుందే?
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు కంటే ముందు నుంచే జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు కంటే ముందు నుంచే జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. వచ్చే నెల నుంచి జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఇక పార్టీని కూడా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. అందుకోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ కంటే ముందు జనంలోకి వెళ్లి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మంచి పనులను చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఆయన నేతలను సిద్ధం చేస్తున్నారు. అయితే జనంలోకి ఏ రూపంలో వెళ్లాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా బహిరంగ సభల ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఫిబ్రవరి నుంచి...
నిన్న తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులతో సమావేశమైన చంద్రబాబు ఇందుకు సంబంధించిన లెక్కలు కూడా చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నుంచేస్వర్ణాంధ్రపేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వచ్చేలా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు ఎనిమిది మాసాల్లో చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. పింఛన్లు పెంపుదల, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా అభివృద్ధి విషయంలో ఏపీ పరుగులు పెడుతున్న విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తీసుకువచ్చిన పెట్టుబడులతో రాష్ట్రానికి కలిగే ప్రయోజ నం.. వచ్చే ఉపాధి, ఉద్యోగాలు వంటివాటిని వివరించన్నారు.
తప్పుడు ప్రచారాన్ని...
ప్రభుత్వంపై ఇప్పటికే కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తుండటంతో ప్రజలు తప్పుగా భావించే అవకాశముందని చంద్రబాబు భావించి ముందుగానే జనంలోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను వివరించాలని డిసైడ్ అయ్యారు. ల్ల తమ ప్రభు త్వం ఏం చేసిందనే విషయంపై ప్రస్తుతం సందేహం గా ఉన్న కొన్ని వర్గాల ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తప్పుడు ప్రచారంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ కాకమునుపే జనంలోకి వెళ్లి వాస్తవాలను వివరిస్తే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు అంచనా వేసుకుని దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఇప్పటికే పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద జనం కంటే ముందుగా జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
Next Story

