Sun Mar 15 2026 18:56:24 GMT+0530 (India Standard Time)
వైసీపీ లో చేరిన టీడీపీ ముఖ్య నేత.. దీంతో ఆ నియోజకవర్గంలో?
తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో షాక్ తగిలింది.

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో షాక్ తగిలింది. మాజీ మంత్రి కుతూహలమ్మ తనయుడు హరికృష్ణ వైసీపీలో చేరారు. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నైట్ క్యాంప్ వద్దకు చేరుకున్న హరికృష్ణ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో...
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో హరికృష్ణ టీడీపీ నేతగా ఉన్నారు. 2019లో టీడీపీ తరుపున ఆయన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనకు టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి పాల్గొన్నారు.
Next Story

