Thu Mar 19 2026 01:16:26 GMT+0530 (India Standard Time)
టీడీపీ కమిటీ పర్యటన నేడు.. పోలీసుల అనుమతిపై?
గుడివాడలో నేడు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది.

గుడివాడలో నేడు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గోవా సంస్కృతిని తెచ్చిన ఆరోపణలపై ఈ కమిటీ విచారించనుంది. కేసినో నిర్వహించి కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ విమర్శిస్తుంది.
నిజనిర్ధారణ కమిటీ....
ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలను నిర్ధారించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కమిటీని నియమించారు. ఈ కమిటీలో మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ, మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు. అయితే టీడీపీ నిజనిర్థారణ కమిటీ గుడివాడ పర్యటనకు పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

