Mon Dec 29 2025 06:45:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎంపీలతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలతో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు గత మూడేళ్లుగా విభజన హామీలు అమలు కాకపోవడం, పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోవడంపై పార్లమెంటులో గళం విప్పాలని సూచించనున్నారు.
ఎండగట్టాలని....
అధికారంలో ఉన్న వైసీపీ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిందని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించనున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వైసీీపీ ప్రభుత్వం విఫలమయిన తీరును ఎండగట్టాలని ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

