Thu Mar 26 2026 16:22:44 GMT+0530 (India Standard Time)
Nijam Gelavali:నేడు కడప జిల్లాకు నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు

Nijam Gelavali:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. నేడు రాయచోటి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బాబు అరెస్ట్ అయిన తర్వాత...
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయినప్పుడు మరణించిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. ఆ కుటుంబాలకు భరోసానిస్తారు. ఆర్థిక సాయం అందచేయనున్నారు. భువనేశ్వరి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు చేశారు. కొన్ని రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నారా భువనేశ్వరి పర్యటిస్తూ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నారు.
Next Story

