Sun Feb 01 2026 15:35:18 GMT+0000 (Coordinated Universal Time)
మార్కాపురంలో బాబు పుట్టినరోజు వేడుకలు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను భారీగా నిర్వహించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను భారీగా నిర్వహించారు. నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఈరోజు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు ఇక్కడే పుట్టిన రోజు వేడుకలు కార్యకర్తల మధ్య జరుపుకున్నారు.
భారీ కేక్ కట్ చేసి...
నేతలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను చంద్రబాబు కట్ చేశారు. వేద పండితులు ఆశీర్వదించారు. అన్ని మతాలకు చెందిన వారు వచ్చి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పెద్దయెత్తున కార్యకర్తలు చేరి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story

