Mon Mar 16 2026 02:59:38 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా లో ఆయన పర్యటన సాగనుంది. ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. గత కొద్ది రోజులుగా వరస బెట్టి నియోజకవర్గాలను చంద్రబాబు చుట్టి వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థులను పరిచయం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తమకు ఈసారి అవకాశమివ్వాలంటూ ఆయన అభ్యర్థిస్తున్నారు.
రెండు నియోజకవర్గాల్లో...
ఈరోజు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో కోడుమూరు, మంత్రాలయంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. రాయలసీమలో ఈసారి అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఆయన పర్యటనలు సాగుతున్నాయి. అభ్యర్థులను పరిచయంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చంద్రబాబు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.
Next Story

