Sun Mar 15 2026 07:17:39 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు రెండు జిల్లాలకు చంద్రబాబు
నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు తన నివాసంలో మ్యానిఫేస్టో విడుదల చేసిన అనంతరం చంద్రబాబు ప్రజాగళం పర్యటనకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెండు నియోజకవర్గాల్లో...
ఈరోజు చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. అనంతరం తెనాలి నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగుతుంది. తెనాలలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బహిరంగ సభలతో పాటు రోడ్ షోలను కూడా నిర్వహించనున్నారు.
Next Story

