Tue Jul 15 2025 15:46:18 GMT+0000 (Coordinated Universal Time)
బాబు బర్త్డే వేడుకలు ఈసారి ప్రజల మధ్యనే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఎల్లుండి నుంచి ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఎల్లుండి నుంచి ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు పరిశీలించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని పార్టీ నేతలు వెల్లడించారు.
మూడు రోజుల పాటు...
ఈ నెల 19,20,21 తేదీల్లో మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో పెద్దయెత్తున జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ నెల20వ తేదీన చంద్రబాబు జన్మదినం. ఆరోజు చంద్రబాబు మార్కాపురం పర్యటనలో ఉంటారని పార్టీ నేతలు వెల్లడించారు. మార్కాపురంలోనే చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story