Fri Jan 30 2026 22:25:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చిత్తూరు జిల్లాకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు ఆయన చిత్తూరు జిల్లాకు వస్తున్నారు. జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న కుప్పం నియోజకవర్గం నేతలను చంద్రబాబు పరామర్శించనున్నారు. కుప్పంలో ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
జైలులో ఉన్న నేతలకు...
వారిని పరామర్శించేందుకు చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాకు రానున్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులతో పాటు పది మంది నేతలు చిత్తూరు జైలులో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న బాబు అక్కడి నుంచి చిత్తూరు బయలుదేరి వెళతారు. 2.30 గంటలకు చిత్తూరు జైలులోని టీడీపీ నేతలను పరామర్శిస్తారు. అలాగే చిత్తూరు నగరంలో గంగనపల్లెలోని మాజీ మేయర్ కటారి హేమలత ఇంటికి చేరుకుని ఆమెను కూడా పరామర్శిస్తారు. తిరిగి సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు.
Next Story

