Thu Dec 18 2025 13:45:26 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి మూడు రోజులు వెస్ట్ లో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసే ప్రయత్నం చేయనున్నారు. వచ్చే నెల రెండో తేదీ వరకూ ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉండనున్నారు. ఉదయం 11.30 గంటలకు జిల్లాలోని విజరాయికి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కోసం పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేశాయి. విజయరాయి బహిరంగ సబ తర్వాత మూడు గంటలకు వలసపల్లి అడ్డరోడ్డుకు చేరుకుంటారు.
"ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి"...
ధర్మాజీగూడెం, మఠంగూడెం, లింగపాలెం గ్రామాల్లో జరిగే సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం చింతలపూడికి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి నరసన్నపాలెంలోని దండమూడి రామలక్ష్మి ఫంక్షన్ లో బస చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధినేత తమ జిల్లాకు వస్తుండటంతో కార్యకర్తలు, నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభలకు భారీ జనసమీకరణను చేస్తున్నారు.
Next Story

