Thu Mar 19 2026 01:42:21 GMT+0530 (India Standard Time)
నేడు నెల్లూరుకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శించనున్నారు. నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు బాధితులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష పరిహారాన్ని ప్రకటించారు. రాత్రి చంద్రబాబు తిరుపతిలోనే బస చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడతారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో....
అనంతరం ఆయన నెల్లూరు జల్లాకు బయలుదేరుతారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు తీవ్ర స్థాయిలో పంట, ఆస్తి నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో పరిశీలిస్తారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు.
Next Story

