Sat Mar 21 2026 10:12:10 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచి కుప్పంలో పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన వివిధ కార్కక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మూడు రోజుల పాటు...
4వ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఆయన కుప్పంలో పర్యటిస్తారని తెలిపింది. రోడ్ షోలలో పాల్గొంటారని పేర్కొంది. ముఖ్యనేతలతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు భారీ భద్రతను ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
Next Story

