Tue Mar 10 2026 03:53:01 GMT+0530 (India Standard Time)
TDP : నేడు టీడీపీ రెండో జాబితా విడుదల
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మలి విడత జాబితాలో ఇరవై ఐదు మంది పేర్లను ప్రకటించే అవకాశముందని తెలిసింది. ఇప్పటి వరకూ పార్లమెంటు సభ్యుల పేర్లను టీడీపీ ప్రకటించలేదు. నేటి జాబితాలో పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
మలి విడత జాబితాలో...
144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. తొలి విడత జాబితాలో చోటు దక్కని ముఖ్యనేతలకు మలి విడత జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఈరోజు జాబితాలో 27 లేదా 36 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. తొమ్మిది అంకె టీడీపీకి సెంటిమెంట్ కావడంతో టీడీపీ నేతలు తలో రకంగా జాబితాలో విడుదలయ్యే సంఖ్యపై చర్చించుకుంటున్నారు. పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
Next Story

