Sun Mar 22 2026 15:24:05 GMT+0530 (India Standard Time)
మహాపాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతుల మహాపాదయాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతుల మహాపాదయాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. 39వ రోజు చేరుకున్న ఈ యాత్రకు ఈరోజు విరామం ప్రకటించారు.
17న తిరుపతిలో...
ఈ నెల 16న పాదయాత్రలో పాల్గొన్న రైతులందరూ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. 17వ తేదీన తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవాలని రైతులు భావిస్తున్నారు. నవంబరు 1న మహా పాదయాత్ర ప్రారంభమయింది. ఈ నెల 16వ తేదీతో ముగియనుంది.
Next Story

