Tue Dec 30 2025 20:32:31 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రెండు జిల్లాల నేతలతో నేడు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కడప, నెల్లూరు జిల్లాల నేతలతో భేటీ కానున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కడప, నెల్లూరు జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. నెల్లూరులో బుచ్చిరెడ్డి పాలెం, కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆ జిల్లా నేతలతో విశ్లేషించనున్నారు. గతంలో వచ్చిన ఓటింగ్ శాతం, ఇప్పుడు టీడీపీకి నమోదయిన ఓట్ల తదితర అంశాలతోపాటు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించనున్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై....
చంద్రబాబు ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లతో పాటు గెలిచిన చోట్ల టీడీపీ నేతలు అనుసరించిన వ్యూహాలను కూడా చంద్రబాబు నేతలకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కడప, నెల్లూరు జిల్లాల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
Next Story

