Sun Dec 28 2025 00:03:49 GMT+0000 (Coordinated Universal Time)
మూడేళ్ల తర్వాత చంద్రబాబు...?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంక్రాంతి పండగను తన సొంత గ్రామమైన నారావారిపల్లిలో జరుపుకోనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంక్రాంతి పండగను తన సొంత గ్రామమైన నారావారిపల్లిలో జరుపుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన సంక్రాంతి పండగ జరిగే మూడు రోజుల పాటు నారావారిపల్లిలో ఉంటారు. దాదాపు మూడేళ్ల తర్వాత చంద్రబాబు నారావారిపల్లి వస్తున్నారు. కరోనా కారణంగా ఆయన పండగను జరుపుకునేందుకు స్వగ్రామానికి రావడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఠంఛనుగా గ్రామానికి వచ్చి స్థానికులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే చంద్రబాబు గత మూడేళ్ల నుంచి దూరంగా ఉన్నారు.
నారావారిపల్లిలో...
గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, కరోనా రావడం వంటి కారణాలతో చంద్రబాబు పండగకు నారావారిపల్లి రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇక్కడ పండగ జరుపుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.చంద్రబాబు ఇంటికి సున్నాలు వేయిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి చంద్రబాబు కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం కూడా నారావారాపల్లిలో ఉంటుందని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి నాని చెప్పారు. చంద్రబాబు రాక కోసం గ్రామస్థులు వెయిట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
Next Story

