Tue Dec 30 2025 13:54:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఇన్ చార్జులతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కూడా నేతలతో సమావేశం కానున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కూడా నేతలతో సమావేశం కానున్నారు. నేడు అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేవం కానున్నారు. భవిష్యత్ లో పార్టీకి ఉపయోగపడని నేతలకు అవకాశాలు ఉండబోవని చంద్రబాబు తెలిపారు. కొత్త నేతలను రంగంలోకి దించుతామని, సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి చెబుతామని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీని వీడి అధికార పార్టీకి తొత్తుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికే పదవులు....
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత అక్కడ నేతలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ద్వితీయ శ్రేణి నేతలను అధికారంలో ఉండగా కొందరు పట్టించుకోలేదని, వారికి పదవులు దక్కకుండా ఎమ్మెల్యేలే అడ్డుపడ్డారని చంద్రబాబు అన్నారు. వీటన్నింటికి తాను చెక్ పెడుతున్నానని, ఇకపై యాక్టివ్ గా ఉండే నేతలకే పార్టీలో పదవులు లభిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
Next Story

