Sat Dec 27 2025 03:54:11 GMT+0000 (Coordinated Universal Time)
బచ్చులను పరామర్శించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును పరామర్శించారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థిితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు చంద్రబాబుకు వివరించారు. కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో బచ్చుల అర్జునుడు రమేష్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని...
గత ఆదివారం నుంచి ఆయన రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్జునుడు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చంద్రబాబు వైద్యులకు సూచించారు. అనంతరం బచ్చుల అర్జునుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
Next Story

