Mon Mar 16 2026 23:23:29 GMT+0530 (India Standard Time)
ఆ హత్యపై చంద్రబాబు ఏమన్నారంటే?
కాకినాడలో దేవిక దారుణ హత్యపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు

కాకినాడలో దేవిక దారుణ హత్యపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం ప్రకటనలు మాని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆయన కోరారు. చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేశారు. చట్టమే లేని దిశ ద్వారా ఏం చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. కాకినాడలో దేవిక హత్యపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన మోసపూరితమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
దిశ చట్ట ప్రకారం...
దిశ చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడం ఆ కుటుంబ సభ్యులను మోసగించడమేనని చంద్రబాబు అన్నారు. ఉత్తుత్తి ప్రకటనలు మాని నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. నేరాల అదుపులో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అందువల్లనే ఘోరాలు జరుగుతున్నాయని తెలిపారు.
Next Story

