Sun Mar 15 2026 10:54:50 GMT+0530 (India Standard Time)
Chandrababu : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. దాదాపు పది రోజుల పాటు విదేశాల్లో ఉన్న చంద్రబాబు నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన అమెరికా కు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు హైదరాబాద్ కు వస్తున్న సంగతి తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు...
ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు ఈ నెల మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయిన తర్వాత 19వ తేదీన అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికాకు వెళ్లారని చెబుతున్నారు. పది రోజుల పాటు విదేశాల్లో ఉండి నేడు హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుని రేపు అమరావతి బయలుదేరి వెళతారు.
Next Story

