Sat Dec 06 2025 03:18:58 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు పర్యటన వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన వాయిదా పడింది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 2,3,4 తేదీల్లో తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. అయితే చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన రెండు రోజుల పాటు వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
భారీ వర్షాల కారణంగా...
భారీ వర్షాలు పడుతున్న కారణంగా తిరుపతి జిల్లా పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4,5,6 తేదీల్లో చంద్రబాబు పర్యటన జరగనున్నట్లు తెలిపింది. ఈ నెల 4న సూళ్లూరుపేట, 5న గూడూరు, 6న వెంకటగిరి నియోజకవర్గాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Next Story

