Tue Mar 17 2026 20:26:19 GMT+0530 (India Standard Time)
ముగిసిన...చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. నిన్న విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి 11.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారు. ఎన్డీఏలో చేరేందుకు ఆయన అంగీకరించారు. పొత్తులు, సీట్ల పంపకాలపై తర్వాత మాట్లాడుకునే అవకాశముంది.
బీజేపీతో కలసి...
అయితే ముందుగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి అభ్యర్థిని పోటీకి దింపాలన్న యోచన వీరిమధ్య వచ్చినట్లు సమాచారం. సీఎం రమేష్ ను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశముంది. మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరుగుతుండటంతో ఒక సీటు కోసం ఈ రెండు పార్టీలూ అభ్యర్థిని బరిలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Next Story

