Wed Feb 04 2026 20:54:24 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో రిమాండ్ గడువు ముగిసినా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ నేటితో ముగియనుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ నేటితో ముగియనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఈ నెల 19వ తేదీ వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ఈ కేసులో నలభై రోజుల నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ దరఖాస్తు కూడా పలుమార్లు తిరస్కరణకు గురయింది.
వర్చువల్గా...
అయితే ఈరోజు మరోమారు చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టులో స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి క్వాష్ పిటీషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. రేపు ప్రకటించే అవకాశముంది. దీంతో చంద్రబాబు రిమాండ్ ను పొడిగించే అవకాశముందంటున్నారు న్యాయవాదులు. ఈరోజు ఏసీబీ కోర్టుకు చంద్రబాబును వర్చువల్ గా ప్రవేశపెట్టనున్నారు.
Next Story
