Tue Mar 17 2026 03:49:23 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు కొవ్వూరుకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర నేడు పశ్చిమగోదావరి జిల్లాలో జరగనుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర నేడు పశ్చిమగోదావరి జిల్లాలో జరగనుంది. రెండో విడత ప్రజాగళం యాత్ర నిన్నటి నుంచి ప్రారంభమయింది. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కొవ్వూరుకు చేరుకుంటారు. చాగల్లు రోడ్డు నుంచి విజయ విహార్ సెంటర్ వరకూ రోడ్ షో నిర్వహిస్తారు.
ఉదయం టీడీపీ నేతలతో...
అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గోపాలపురంలో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థులతో ఆయన సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

