Thu Mar 19 2026 04:28:44 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు ముందస్తు బెయిల్పై విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసుల విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఐఆర్ఆర్ కేసులో...
అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ ఆయనపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రెండు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టు ను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది.
Next Story

