Sun Mar 15 2026 07:19:19 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు విశాఖ జిల్లాలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. ప్రజాగళం పేరిట గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా తిరుగుతున్న చంద్రబాబు రోజుకు రెండు నియోజకవర్గాలను చుట్టి వస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
బుజ్జగింపులు కూడా...
తొలుత పాయకరావుపేట నియోజకవర్గంలో పాల్గొన్న అనంతరం తర్వాత గాజువాకలో జరగనున్న ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించనున్నారు. సభకు ముందు, తర్వాత ఆయన పార్టీలో ఉన్న కీలక నేతలతో సమావేశమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు పార్టీలో అసంతృప్త నేతలను పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు.
Next Story

